మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ విజయలక్ష్మి
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ విజయలక్ష్మి
చిట్టమూరు, జనవరి 27 : కరోనాపై ప్రజలను అప్రమతం చేయాలని ఎంపీపీ విజయలక్ష్మి కోరారు. గురువారం చిట్టమూరు మండల సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్నా ప్రజలు జాగ్రత్తలు పాటించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని, వ్యాక్సిన్ వేయించుకోవడంలోను సహకరించడంలేదని వైద్యాధికారులు చెప్పడంతో.. ఆమె మాట్లాడారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సచివాలయం సిబ్బంది గ్రామాల్లో పర్యటించి, వ్యాక్సిన్ వేయించుకొనేలా అవగాహన కల్పించాలన్నారు. తాగునీరు, పారిశుధ్య కార్యక్రమాలపై ఆయా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు. ఈవోపీఆర్‌డీ, తహసీల్దార్ మునిలక్ష్మి, మండల ఉపాధ్యక్షుడు బద్దిగ వెంకట రమణయ్య, సుబ్బమ్మ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.