‘ఉపాధిహామీ’ పనుల్లో అవినీతి జరిగితే చర్యలు

ABN , First Publish Date - 2022-08-09T03:54:30+05:30 IST

ఉపాధిహామీ పనుల్లో అవినీతి జరిగితే సహించేది లేద ని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి హెచ్చరించారు. దండేపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం 12వ విడత ఈజీఎస్‌ సామాజిక ప్రజా వేదిక నిర్వహించారు. జూన్‌ 2019 నుంచి జూలై 2022 వరకు చేపట్టిన పనుల బిల్లు చెల్లింపుపై గ్రామాల వారీగా పరిశీలించారు. పనుల వివరాలు, ఖ ర్చులను చదివి వినిపించారు.

‘ఉపాధిహామీ’ పనుల్లో అవినీతి జరిగితే చర్యలు
ఉపాధిహామీ ప్రజావేదికలో పాల్గొన్న అధికారులు

దండేపల్లి, ఆగస్టు 8: ఉపాధిహామీ పనుల్లో అవినీతి జరిగితే సహించేది లేద ని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి హెచ్చరించారు. దండేపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం 12వ విడత ఈజీఎస్‌ సామాజిక ప్రజా వేదిక నిర్వహించారు. జూన్‌ 2019 నుంచి జూలై 2022 వరకు చేపట్టిన  పనుల బిల్లు చెల్లింపుపై గ్రామాల వారీగా పరిశీలించారు. పనుల వివరాలు, ఖ ర్చులను చదివి వినిపించారు. 31 గ్రామ పంచాయతీలో మూడేళ్ళలో 3007 పను లు చేపట్టగా, రూ.8,95,46,842 నిధులు కేటాయించారు. కూలీలకు రూ.7,07,63, 130, మెటిరియల్‌కు రూ.1,87,83,712 ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉపాధిహామీ పథకం పనులలో సిబ్బంది అక్రమాలకు పాల్పడితే వారిపై శాఖ పరమైన చర్యలతోపాటు రికవరి చేస్తామన్నారు. ఏపీడీ దత్తరావ్‌, స్టేట్‌ మేనేజర్‌ నరేందర్‌, ఎస్సార్పీ కొమురయ్య, జిల్లా విజిలెన్స్‌ అఽధికారి సురేష్‌, ఎంపీడీవోలు మల్లేషం, శ్రీనివాస్‌, ఏపీవో దుర్గదాస్‌, కార్యదర్శులు, పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-09T03:54:30+05:30 IST