నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు : డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2022-07-06T05:06:33+05:30 IST

నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు : డీఎంహెచ్‌వో

నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు : డీఎంహెచ్‌వో
బస్తీ దవాఖానాను పరిశీస్తున్న పుట్ల శ్రీనివాస్‌

మేడ్చల్‌, జూలై 5(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రు లపై చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ విషయంపై వస్తున్న ఫిర్యాదుల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులను తనిఖీలు చేసినపుడు అనేక లోపాలు బయట పడ్డాయన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండానే కొందరు ప్రైవేటు ఆసుపత్రులు నడుపుతున్నట్టు తమకు సమాచారం అందిందన్నారు. దీనిపై కొన్ని ఆసుపత్రులను తనిఖీ చేశామని, అందులో ఒక ఆసుపత్రిని సీజ్‌ చేయడంతో పాటు నాలుగు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామని డీఎంహెచ్‌ఓ తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చాలావరకు ధరల పట్టికలను ఏర్పాటు చేయడంలేదన్నారు. అదేవిధంగా బెడ్స్‌ ఉన్న మేరకు వైద్యులు, సిబ్బంది ఉండక పోవడంలాంటి సమస్యలు తాము తనిఖీల్లో గుర్తించామని చెప్పారు. అనుమతులు లేని ఆసుప్రతులను మూసి వేస్తామని అన్నారు. దీనికితోడు జిల్లాలో ప్రసూతి ఆపరేషన్లు ఎక్కువగా చేస్తున్నారన్నారు. ఇలాంటి ఆపరేషన్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 40శాతం జరుగుతుంటే ప్రైవేటులో మాత్రం 60శాతం జరుగుతున్నాయన్నారు. అనవసర ఆపరేషన్లను తగ్గించకుంటే చర్యలు తప్పవన్నారు. అదేవిధంగా ఆసుపత్రుల్లో ఫీజులు కూడా ఎక్కువగా వసూలు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని జిల్లా వైద్యాధికారి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా లోపాలను సరిచేసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. రోగులకు మెరుగైన వైద్యం ఇప్పటికే అందిస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-07-06T05:06:33+05:30 IST