పార్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు

ABN , First Publish Date - 2022-08-14T06:18:58+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటుందని పార్టీ కార్యాకలాపాలలో తరచుగా హాజరు కాని వారు, పార్టీ నియమ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని టీఆర్‌ఎస్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య అన్నారు.

పార్టీ నిబంధనలు పాటించని వారిపై చర్యలు
మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య

- టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 13: టీఆర్‌ఎస్‌ పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటుందని పార్టీ కార్యాకలాపాలలో తరచుగా హాజరు కాని వారు, పార్టీ నియమ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని టీఆర్‌ఎస్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం పద్మనాయక కల్యాణ మండపంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ పట్టణ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అగయ్య మాట్లాడుతూ ప్రత్యేక తెలం గాణ ఉద్యమస్థాయి నుంచి నేడు తెలంగాణను అభివృద్థి పథంలోకి ముఖ్యమం త్రి కేసీఆర్‌ ముందుకు తీసుకవెళుతున్నారని అన్నారు. ప్రతిపౌరునికి ఉపయోగ పడేలా అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి విజయవంతంగా నిర్వహి స్తూ అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు తీసుకవెళ్తున్నారని అన్నారు.  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరా వులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులు గడపగడపకు తెలియపర్చాలని అన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, జిల్లా గ్రంధాలయ చైర్మన్‌ అకూనూరి శంకరయ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, అర్భన్‌బ్యాంక్‌ చైర్మన్‌ గాజుల నారాయణ, రైతు బంధు మండల అధ్యక్షుడు అగ్గిరాములు, మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు భైరి ప్రభాకర్‌ టీఆర్‌ఎస్‌ పట్టణ కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు సంజీవ్‌గౌడ్‌, ఎండీ సత్తార్‌, మహిళ విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ, టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్‌, సబ్బని హారీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T06:18:58+05:30 IST