సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN , First Publish Date - 2022-08-11T04:39:30+05:30 IST

మండలంలో నెలకొన్న సమస్య ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీపీ అన్నం మంగ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్‌ సమావేశ హాల్‌లో ఎంపీపీ అన్నం మంగ చిన్నయ్య అద్యక్షతన బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు

సమస్యల పరిష్కారానికి చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ అన్నం మంగ

- ఎంపీపీ అన్నం మంగ

లక్షెట్టిపేట రూరల్‌, ఆగస్టు  10:  మండలంలో నెలకొన్న సమస్య ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీపీ అన్నం మంగ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్‌ సమావేశ హాల్‌లో ఎంపీపీ అన్నం మంగ చిన్నయ్య అద్యక్షతన బుధవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతరం పలువురు అధికారులు నివేదికలు చదివారు. మండలంలో సుమారు 3 వేలకు పైగా నూతన పింఛన్లు పంపిణి చేయనున్నట్లు ఎంపీవో ప్రసాద్‌ తెలిపారు. మండలంలో ఇప్పటి వరకు వంద శాతం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయిందని పీహెచ్‌సీ వైద్యాధికారి సతీష్‌ తెలిపారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో వివిధ అంగన్‌వాడీ  కేంద్రాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్‌ స్థంభాలను మార్చి వాటి స్థానంలో  నూత న స్థంభాలు వేసినట్లు విధ్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు.  గుల్లకోట గ్రామంలో పెద్ద కెనాల్‌ రోడ్డుపై కెనాల్‌లో మట్టి పోయడంతో బురదమయంగా మారి రైతులు అటువైపు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మరమ్మత్తులు చేయాలని సర్పంచ్‌ రవిందర్‌ ఇరిగేషన్‌ అధికారులను కోరగా  మరమ్మత్తు పనులను చేపడతామని అధికారులు చెప్పారు. మండలానికి మొత్తం 33 క్రీడా మైదానాలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చాయని, స్థల పరిశీలన చేపడుతున్నట్లు ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ కొత్త సత్తయ్య, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, ఎంపీవో విజయ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-11T04:39:30+05:30 IST