సర్పంచ్‌ల చెక్‌ పవర్‌కు చర్యలు

ABN , First Publish Date - 2021-05-08T05:15:28+05:30 IST

గ్రామ సర్పంచ్‌ల చెక్‌ పవర్‌ మం జూరుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

సర్పంచ్‌ల చెక్‌ పవర్‌కు చర్యలు

గంట్యాడ, మే 7:  గ్రామ సర్పంచ్‌ల  చెక్‌ పవర్‌ మం జూరుకు అధికారులు  చర్యలు ప్రారంభించారు. ఆ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఆదేశాలు జారీ  చేశారు.  దీనిలో భాగంగా మండల పరిషత్‌ అధికారుల లాగిన్‌ ద్వారా సీఎఫ్‌ఎంఎస్‌లో సర్పంచ్‌ల వివరాలు నమోదు చేస్తున్నారు.  ప్రతి సర్పంచ్‌కు సంబంధించిన బ్యాంకు ఖాతా, ఆధార్‌, పాన్‌ నెంబర్లతోపాటు తండ్రి, లేదా భర్త పేర్లు తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈ ప్రక్రియ మొదలు పెట్టారు. గతంలో  ఇచ్చిన బ్యాంకు ఖాతా నెంబరును ఇప్పుడు ఆన్‌లైన్‌లో తీసు కోవడం లేదు. అటువంటి వారు కొత్తగా బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేసి, ఆధార్‌ అను సంధానం చేసి, ఎంపీడీవోలకు ఇవ్వాల్సి ఉంది. ఎంపీడీవోల వివరాలు ఆన్‌లైన్‌ చేసిన తరువాత ఖజానా కార్యాలయాలకు పంపిస్తారు. అంతా పరిశీలించిన తరువాత సర్పంచ్‌లకు ఐడీ నెంబర్లను కేటాయిస్తారు. అనంతరం సర్పంచ్‌లు చెక్‌ పవర్‌ వినియోగించుకునే అవకాశం ఉంది. మండలంలోని ఇప్పటివరకూ మూడు పంచాయతీలకు చెందిన సర్పంచ్‌ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్టు ఎంపీడీవో నిర్మలాదేవి తెలిపారు.  


Updated Date - 2021-05-08T05:15:28+05:30 IST