గ్రానైట్‌ వ్యర్థాలను బయట పారబోస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-08-03T06:02:24+05:30 IST

గ్రానైట్‌ వ్యర్థాలను పరిశ్రమ ల్లోనే డంపింగ్‌ చేసుకోవాలని, బయట పారబోస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ హెచ్చరిం చారు.

గ్రానైట్‌ వ్యర్థాలను బయట పారబోస్తే చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

  పరిశ్రమల్లోనే డంపింగ్‌ చేసుకోవాలి

  15 రోజుల్లో నివేదికలు అందించండి

  కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌


అరసవల్లి, ఆగస్టు 2: గ్రానైట్‌ వ్యర్థాలను పరిశ్రమ ల్లోనే డంపింగ్‌ చేసుకోవాలని, బయట పారబోస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ హెచ్చరిం చారు. గ్రానైట్‌ వ్యర్థాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈని ఆదేశించారు. కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో క్లస్టర్లగా ఉన్న గ్రానైట్‌ కటింగ్‌, పాలిషింగ్‌ యూనిట్ల ద్వారా వచ్చే వ్యర్థాలను సంబంధిత కంపెనీల్లోనే డంపింగ్‌ చేసుకోవాలని, దీనికోసం యార్డులు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. డం పింగ్‌ యార్డు ఏర్పాటు చేయకుండా వ్యర్థాలను వ్యవసా య భూములు, రహదా రులపై పారబోస్తే ప్రాజెక్టు కాస్ట్‌పై ఒక శాతం, టర్నోవర్‌పై 1.25శాతం పెనాల్టీ వేస్తామని హెచ్చరించారు. కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్‌ సమీపంలోని వ్యవసాయ భూమిలో మా ర్బుల్‌ వ్యర్థాలను అశాస్త్రీయంగా డంపింగ్‌ చేయడంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (న్యూఢిల్లీ)కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రెవెన్యూ, పోలీసు, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, భూగర్భ గనులు, ఆర్‌ఆండ్‌బీ, పంచా యతీరాజ్‌ శాఖలకు సంబంధించిన అధికారు లతో కూడిన కమిటీ గ్రానైట్‌ కంపెనీల డంపింగ్‌ యార్డులను పరిశీలించి 15 రోజు ల్లోగా నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో శాసన మండలి సభ్యుడు పాలవలస విక్రాంత్‌, పొ ల్యూషన్‌ బోర్డు అధికారి రాజేంద్రరెడ్డి, అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, ఆర్డీవో బి.శాంతి, ఈఈ శంకర్‌నాయక్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి, డీపీవో రవికుమార్‌, పరిశ్రమల శాఖ డీడీ ఉమామహేశ్వరరావు, భూగర్భ గనుల శాఖ ఏడీ, గ్రానైట్‌ కంపెనీల యాజమాన్యాలు, తదితరులు పాల్గొన్నారు. 


విలేజ్‌ క్లినిక్‌ సేవలు ఆదర్శంగా నిలవాలి

జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి వైఎస్‌ఆర్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా అందించే సేవలు రాష్ట్రలోనే ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఆ దిశగా వైద్యాధికారులు, ఎల్‌ఎంహెచ్‌పీలు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు కృషి చేయాలని  తెలి పారు. చిలకపాలెంలోని శివానీ ఇంజనీరింగ్‌ కళాశాల సమావేశ మందిరంలో  మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌లపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.  కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడా రు.  రెండు వేల జనాభా దాటిన గ్రామాల్లో రూ.20లక్షల వ్యయంతో ప్రభుత్వం ఆసు పత్రులను నిర్మిస్తుందన్నారు. ఈ విలేజ్‌ క్లినిక్‌లలో ఒక వైద్యాధికారి, ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశావర్కర్‌ ఉంటారని చెప్పారు. జిల్లాలో 600 మంది ఏఎన్‌ఎంలు ఉన్నారని, సచివాలయ వ్యవస్థ ద్వారా మరో 500 మందికి పైగా ఏఎన్‌ఎంలను గత మూడేళ్లలో రిక్రూట్‌ చేసినట్లు తెలిపారు. ప్రతీ ఆసుపత్రిలో కావలసిన మందులు, పరికరాలు, సిబ్బందిని సమకూర్చినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 200 విలేజ్‌ క్లినిక్స్‌ సిద్ధంగా ఉన్నాయని, మరో 394  వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ శిక్షణా కార్యక్ర మంలో వైద్యఆరోగ్యశాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ నర్సింగరావు, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ బి.మీనాక్షి, జె.కృష్ణమోహన్‌, డాక్టర్‌ సూర్యకుమారి, 104 కో-ఆర్డినేటర్‌ యు.లక్ష్మణరావు, ఏఎన్‌ఎంలు, తదితరులు పాల్గొన్నారు.   శ్రీకా కుళం రూరల్‌ మండలం కేంద్రీయ విద్యాలయంలో కూడా శిక్షణ జరిగింది. ఇక్కడ ఆర్వో పాంట్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు.


Updated Date - 2022-08-03T06:02:24+05:30 IST