నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-07-12T09:56:58+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ ఉదృతమవుతున్న నేపథ్యంలో దుకాణాలు మద్యాహ్నం వరకే తెరవాలని వ్యాపారవర్గాలు స్వచ్ఛందంగా నిర్ణయించిన

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి


గుంటూరు, జులై 11: జిల్లాలో కరోనా వైరస్‌ ఉదృతమవుతున్న నేపథ్యంలో దుకాణాలు మద్యాహ్నం వరకే తెరవాలని వ్యాపారవర్గాలు స్వచ్ఛందంగా నిర్ణయించిన నేపథ్యంలో మెడికల్‌ షాపులు, పాలబూత్‌లకు ఆయా ఆంక్షలనుంచి మినహాయింపు ఉంటుందని అర్బన్‌ ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించారు.


తొలుత మెడికల్‌ కళాశాల వెనుక ఉన్న పోలీస్‌ క్వార్టర్స్‌ను అధికారులతో కలసి పరిశీలించారు. అక్కడ కొత్త్తగా క్వార్టర్స్‌ను నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా అక్కడ ఉన్న పోలీస్‌ వాటర్‌ప్లాంట్‌ను పరిశీలించారు.  నగరంలోని కంటైన్‌మెంట్‌ ప్రాంతాలైన నల్లచెరువు, బ్రాడీపేట తదితర ప్రాంతాలలో పర్యటించి కొవిడ్‌ విధులను పరిశీలించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ డి గంగాధరం, ఏఆర్‌డిఎస్పీ చంద్రశేఖర్‌, ఆర్‌ఐ రాజారావు, వెస్ట్‌ ట్రాఫిక్‌ సీఐ వెంకటరెడ్డి, అరండల్‌పేట సీఐ బత్తుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-12T09:56:58+05:30 IST