అనధికార లేఅవుట్లపై చర్యలు

ABN , First Publish Date - 2021-07-31T05:56:29+05:30 IST

అనుమతి లేని లేఅవుట్లపై చర్యలు చేపడతామని జిల్లా లేఅవుట్‌ విజిలెన్స్‌ అధికారి ప్రేమ్‌సాగర్‌ తెలిపారు.

అనధికార లేఅవుట్లపై చర్యలు
విజిలెన్స్‌ అధికారికి లేఅవుట్‌ వివరాలను అందిస్తున్న ఈవోపీఆర్డీ

లేఅవుట్‌ విజిలెన్స్‌ అధికారి ప్రేమసాగర్‌


చోడవరం, జూలై 30: అనుమతి లేని లేఅవుట్లపై చర్యలు చేపడతామని జిల్లా లేఅవుట్‌ విజిలెన్స్‌ అధికారి ప్రేమ్‌సాగర్‌ తెలిపారు. మండలాల్లో లేఅవుట్ల పరిశీలన నిమిత్తం శుక్రవారం వచ్చిన ఆయన, స్థానిక ఈవోపీఆర్డీతో సమావేశమై లేఅవుట్ల వివరాలను సేకరించారు. జిల్లాలో లేఅవుట్లకు అనుమతులు ఉన్నదీ, లేనిదీ పరిశీలించే పనిలో విజిలెన్స్‌ అధికారులు నిమగ్నమైనట్టు ఆయన చెప్పారు. అనధికార లేఅవుట్లలో ఎవరూ ప్లాట్లు కొని మోసపోవద్దని సూచించారు.

Updated Date - 2021-07-31T05:56:29+05:30 IST