మొక్కలు బతకకపోతే సర్పంచ్‌, కార్యదర్శులపై వేటు

ABN , First Publish Date - 2020-07-15T16:12:31+05:30 IST

హరితహారం లో నాటిన మొక్కలు బతకకుంటే గ్రామ స ర్పంచ్‌, కార్యదర్శిపై వేటు తప్పదని కలెక్టర్‌ నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన బోధన్‌ మండలం సాలూర, ఖాజా పూర్‌, హున్సా, కోటగిరి మండలంలోని సుంకి ని గ్రామాల్లో ఆకస్మీకంగా పర్యటించారు.

మొక్కలు బతకకపోతే సర్పంచ్‌, కార్యదర్శులపై వేటు

బోధన్‌/కోటగిరి (నిజామాబాద్) : హరితహారం లో నాటిన మొక్కలు బతకకుంటే గ్రామ స ర్పంచ్‌, కార్యదర్శిపై వేటు తప్పదని కలెక్టర్‌ నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన బోధన్‌ మండలం సాలూర, ఖాజా పూర్‌, హున్సా, కోటగిరి మండలంలోని సుంకి ని గ్రామాల్లో ఆకస్మీకంగా పర్యటించారు. సా లూరలో వైకుంఠధామం నిర్మాణ పనులను ప రిశీలించారు. వైకుంఠధామం వెనకాల మినీ వాటర్‌ ట్యాంక్‌ ఉండి అంతర్రాష్ట్ర రోడ్డు పక్క నే ఉన్నందున ఇట్టి ట్యాంక్‌ను మినీ ట్యాంక్‌బండ్‌ లాగా మార్చాలని దీనికి నిధులు మం జూరు చేయాలని ఎంపీపీ బుద్దె సావిత్రి కలె క్టర్‌ కోరారు. కలెక్టర్‌ గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులు ఎస్టిమేషన్‌ వేసి పం పించాలని ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దులో నిర్మిస్తున్న కంపోస్టు షెడ్‌ను మహారాష్ట్ర అధి కారులు వచ్చి పనులను ఆపేస్తున్నారని పను లు చేస్తున్న మేస్ర్తీలను పోలీస్‌స్టేషన్‌కు తీసు కెళ్తున్నారని కలెక్టర్‌ ఎంపీపీ తెలపగా ఆర్డీవో, తహసీల్దార్‌లను మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశి ంచారు. అంతరాష్ట్ర రహదారి బోధన్‌ నర్సిరో డ్డు సాలూరక్యాంప్‌ నుంచి చెక్‌పోస్టు వరకు మొక్కలు ఎందుకు పెంచలేదని పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లను మందలించారు. మళ్లీ వారంలో వస్తానని మార్పు రావాలని లేకపో తే చర్యలుంటాయన్నారు. సుంకిని గ్రామంలో హరితహారం అమలు తీరు సక్రమంగా లేక పోవడంపై కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే శారు. రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటిన్న ప్పటికీ ట్రీగార్డులు, మొక్కలు పడిపోయిన ప ట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోమారు ఇలాంటి సమస్యలు దృ ష్టికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ ని హెచ్చరించారు. ఆయన వెంట బోధన్‌ ఆర్డీ వో గోపిరాం, తహసీల్దార్‌ గఫర్‌మియా, ఎండీ వో సుదర్శన్‌, ఎంపీవో మధుకర్‌, సర్పంచ్‌లు బుయ్యన్‌ చంద్రకళ, ఎస్‌ఏ అమీర్‌, ఎంపీటీసీ కండెల సవిత, పీఏసీఎస్‌ చైర్మన్‌ శివకాంత్‌, మాజీ రైతు బంధు మండల కోఆర్డినేటర్‌ బు ద్దె రాజేశ్వర్‌, ఉప సర్పంచ్‌ సరిడే సాయిలు, బుయ్యన్‌ సురేష్‌, గాండ్ల రాజేశ్వర్‌, వెంకట్‌ప టేల్‌, రాజప్ప, ఖదీర్‌, కోటగిరి జడ్పీటీసీ శంకర్‌ పటేల్‌, ఏఎంసీ చైర్మన్‌ గంగాధర్‌, సర్పంచ్‌ మాధవరావు, ఎంపీడీవో అతారుద్దీన్‌, తహసీ ల్దార్‌ విఠల్‌, ఎంపీవో మారుతి, ఏపీవో రమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-15T16:12:31+05:30 IST