‘ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2021-05-12T05:41:12+05:30 IST

కొవిడ్‌కు వైద్యం పేరుతో ప్రజలను పీల్చిపిప్పిచేసి రూ.లక్షలు దోచుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు డిమాండ్‌ చేశారు.

‘ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి’

నంద్యాల, మే 11: కొవిడ్‌కు వైద్యం పేరుతో ప్రజలను పీల్చిపిప్పిచేసి రూ.లక్షలు దోచుకుంటున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాముడు డిమాండ్‌ చేశారు. మంగళవారం నంద్యాల శాఖ సీపీఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్‌ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాగరాముడు మాట్లాడుతూ కేవలం ధనార్జనే ధ్యేయంగా పేద ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా డబ్బు పరపతి ఉన్న వారికి  మాత్రమే బెడ్లు ఇస్తున్నారని అన్నారు. ఆక్సిజన్‌ పెట్టాలంటే రోజుకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల వసూళ్ళ దందాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చైతన్య, విష్ణు, సురేష్‌, రమణ, చంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2021-05-12T05:41:12+05:30 IST