పర్యావరణానికి హాని కలిగించే ..ఆక్వా యాజమాన్యాలపై చర్యలు

ABN , First Publish Date - 2020-05-20T10:17:05+05:30 IST

నిబంధనలను అతిక్రమించి పర్యావరణానికి హానీ కలిగించే ఆక్వా చెరువుల యాజమాన్యాలపై కఠిన

పర్యావరణానికి హాని కలిగించే ..ఆక్వా యాజమాన్యాలపై చర్యలు

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి 


కాకినాడ, మే 19 (ఆంధ్రజ్యోతి): నిబంధనలను అతిక్రమించి పర్యావరణానికి హానీ కలిగించే ఆక్వా చెరువుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. ఆక్వాకల్చర్‌పై నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ఆయా అంశాలను ప్రస్తావించారు. ఆక్వా చెరువుల ఏర్పాటుకు సంబంధించి 3074 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.  రెండు నెలల్లో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు. జిల్లాలో 60 వేల ఎకరాల్లో ఆక్వా సాగులో ఉందని, ఈ ఏడాది 1.41 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు సాగయ్యాయన్నారు. జిల్లా స్థాయి కమిటీలో నియమితులైన జేసీ లక్ష్మిశ ప్రత్యేక చొరవ తీసుకుని కోనసీమలో ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. రైతులకు అండగా ఉండేందుకు స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీష్‌ టెక్నాలజీ ప్రిన్సిపాల్‌ కోటేశ్వరరావును ప్రభుత్వం నియమించిందన్నారు. కొవిడ్‌ సమయంలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకున్న కలెక్టర్‌ను జిల్లా స్థాయి సభ్యుడు సీహెచ్‌ సూర్యారావు అభినందించారు. సమావేశంలో మత్య్సశాఖ జేడీ పి.జయరావు, పొల్యూషన్‌, గ్రౌండ్‌ వాటర్‌, ఇరిగేషన్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-20T10:17:05+05:30 IST