రోడ్డు ఆక్రమణలను కూల్చివేయిస్తున్న కార్యదర్శి ఉష
ఘట్‌కేసర్ రూరల్, జూన్ 27: రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని ఎదులాబాద్ కార్యదర్శి ఉష హెచ్చరించారు. ఎదులాబాద్‌లో సోమవారం ఆక్రమించి కట్టిన మెట్లు, ర్యాంపులను జేసీబీతో తొలగించారు. గ్రామసభలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని తీర్మానించారు. నోటీసులివ్వకుండ ఎలా కూలుస్తారని కొందరు కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు. మైక్‌తో గ్రామంలో చాటింపు వేయించినట్లు తెలిపారు. రోడ్లపైకి వచ్చిన నిర్మాణాలను చట్టపరంగానే తొలగిస్తున్నామని పేర్కొన్నారు.