‘నాడు-నేడు’లో పురోగతి లేకుంటే చర్యలు

ABN , First Publish Date - 2021-06-20T05:18:29+05:30 IST

పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనుల్లో పురోగతి లేకపోతే చర్యలు తప్పవని జేసీ మహేష్‌ కుమార్‌ హెచ్చరించారు. శనివారం కలెక్టర్‌ ఆడిటోరియంలో మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఇంజినీరింగ్‌ అధికారులతో నాడు-నేడు పనులపై సమీక్షించారు.

‘నాడు-నేడు’లో పురోగతి లేకుంటే చర్యలు
మాట్లాడుతున్న జేసీ మహేష్‌ కుమార్‌

  అధికారుల సమీక్షలో జేసీ మహేష్‌ కుమార్‌ వెల్లడి

కలెక్టరేట్‌, జూన్‌ 19:  పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనుల్లో పురోగతి లేకపోతే చర్యలు తప్పవని జేసీ మహేష్‌ కుమార్‌ హెచ్చరించారు.  శనివారం కలెక్టర్‌ ఆడిటోరియంలో మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఇంజినీరింగ్‌ అధికారులతో నాడు-నేడు పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రోజా ఇచ్చిన టార్కెట్‌ను సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షస్తానని చెప్పారు. అప్పటికీ పురోగతి లేకపోతే ఊరుకునేది లేదన్నారు. జిల్లాలోని 1040 పాఠశాలలను నాడు-నేడు కింద ఎంపిక చేయగా, 854 బడుల పనులు పురోగతిలో ఉన్నాయని, 323  స్కూళ్ల  పనులు పూర్తయ్యాయని చెప్పారు.   415 పాఠశాలలు వాల్‌ పెయింట్స్‌, 362 సివిల్‌ వర్క్స్‌ పూర్తయ్యాయని తెలిపారు. ఎంఈవోలు, ఆర్‌డబ్ల్యూఎస్‌, గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్‌, ఏపీఈడబ్ల్యూఐడీసీ, సమగ్ర శిక్ష శాఖల ఇంజినీర్లు  రోజూ  కనీసం 3 గంటల పాటు పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచిం చారు.  ఎప్పటికప్పుడు బిల్లులను అప్‌లోడ్‌  చేయాలని,  ఎం.బుక్‌ను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. సిమెంట్‌, ఇతర సామగ్రి, సాంకేతిక సమస్య లేమైనా తలెత్తితే వెంటనే జిల్లా విద్య శాఖను సంప్రదించాలన్నారు.   సమావేశంలో డీఈవో నాగమణి , జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. 

  గ్రామాల్లో సర్వే 

గ్రామాల్లో పారిశుధ్యం చర్యలు పటిష్టంగా చేపట్టాలని  జేసీ మహేష్‌ కుమార్‌ ఆదేశించారు. ఆయా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..   100 రోజుల పాటు స్వచ్ఛ సంకల్పం కార్యచరణలో భాగంగా రోజుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. వచ్చే నెల 8న చేపట్టనున్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి ముందుగా వైద్య సిబ్బందితో గ్రామాల్లో సర్వే చేయిస్తామని చెప్పారు. అనంతరం ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తామన్నారు. పారిశుధ్యం సరిగా లేని గ్రామాలపై పటిష్ట చర్యలు చేపట్టాలని , నిర్వహణ సరిగా లేకపోతే స్థానిక అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తడి,పొడి చెత్త , మెడికల్‌ వ్యర్థాల సేకరణపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని ఎంపీడీవోలకు సూచించారు.   గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల సీజనల్‌ వ్యాధుల ముప్పు నుంచి బయటపడొచ్చని తెలిపారు. భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. బయోమెట్రిక్‌ మిషన్లు సరిగా లేవని, ఉన్నవి మరమ్మ తులకు గురయ్యాయని   ఎంపీడీవోలు  జేసీ దృష్టికి తీసుకొచ్చారు.  సచివాల యాల్లో స్టేషనరికీ సంబంధించి విధివిధానాలు సరిగా లేవని వివరించారు.   డీపీవో సుభాషిణి , జిల్లా కోఆర్డినేటర్‌ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. 

 70 వేల మందికి టీకా 

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రజలుఇంటి వద్దకు వెళ్లి టీకా వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జేసీ మహేష్‌ కుమార్‌ చెప్పారు. ఇందులోభాగంగా 70 వేల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా  పెట్టుకు న్నామని ,  ఆదివారం  స్పెషల్‌  డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  ప్రతి సచివాలయం, పీహెచ్‌సీల్లో టీకా వేయనున్నట్లు  చెప్పారు.   45 ఏళ్లు నిండిన వారు, ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్న తల్లులకు , ప్రభుత్వ ఉద్యోగులు, దివ్యాంగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులుకు టీకా వేస్తార న్నారు.  జిల్లా వైద్యాధికారి రమణకుమారి, వ్యాక్సినేషన్‌ ఇన్‌చార్జి గోపాలకృష్ణ, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు. 

 

 

Updated Date - 2021-06-20T05:18:29+05:30 IST