విఽధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-07-31T05:29:44+05:30 IST

విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ హెచ్చరించారు.

విఽధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు
జి.సిగడాం:ఈ-పంట నమోదును పరిశీలిస్తున్న కలెక్టర్‌ లఠ్కర్‌

 కలెక్టర్‌ శ్రీకేష్‌  బాలాజీ లఠ్కర్‌

జి.సిగడాం/లావేరు: విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని  కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ  లఠ్కర్‌  హెచ్చరించారు. శుక్రవారం జి.సిగడాం మండలం సంతవురిటి, లావేరు మండలం  తాళ్లవలస సచివాలయాలను  సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండా లన్నారు. గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రాల భవన పనులను  త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను  ఆదేశించారు. తాళ్లవలసలో ఈ-పంట నమోదును కలెక్టర్‌ పరిశీలించారు. కార్యక్రమంలో జి.సిగడాం తహసీల్దార్‌ ఎం.లావణ్య, డీటీ ప్రసాదరావు, ఎంపీడీవో డి.నాగమణి, ఏవో బి.ఇందుమతి పాల్గొన్నారు.

తాడివలస సచివాలయ సిబ్బందికి మెమోలు

పొందూరు:విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన తాడివలస సచివాలయ సిబ్బం దిపై జేసీ-1 వి.శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందికి మెమోలు జారీచే యాలని ఎంపీడీవో మురళికృష్ణను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని కింతలి, తాడివలస, గోకర్ణపల్లి, కొంచాడ గ్రామ సచివాలయాలలో ఆకస్మిక తనిఖీచేశారు.  సచివాలయాల్లో  వినతులుపెరగాలని తెలిపారు. సచివాయాలు ప్రారంభం నుంచి  వచ్చిన వినతులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తంచేశారు.  విధుల్లో అలసత్వం ప్రద ర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఇచ్ఛాపురం రూరల్‌: సచివాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మత్‌ తెలిపారు.  శుక్రవారం  మండలంలోని తులసిగాం సచివాలయాన్ని తనిఖీ చేశారు.  కార్యక్రమం లో తహసీల్దార్‌ చిన్న రామారావు, డీటీ శ్రీహరి, కార్యదర్శి జి.చిన్నారి  పాల్గొన్నారు. 

 



Updated Date - 2021-07-31T05:29:44+05:30 IST