పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-09-25T05:48:19+05:30 IST

పారిశుధ్యంపై ఆయా గ్రామాల సర్పం చులు, కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి

పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు 


తాండూర్‌(బెల్లంపల్లి), సెప్టెంబరు 24: పారిశుధ్యంపై ఆయా గ్రామాల సర్పం చులు, కార్యదర్శులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు హెచ్చరించారు. గురువారం కొత్తపల్లి, గోపాల్‌నగర్‌ గ్రామ పంచాయతీలను తనిఖీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయ తీల పారిశుధ్య నిర్వహణపై ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.  పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని, 24 గంటలలోపు కొత్తపల్లి పంచాయతీ పరిధిలో గల మురికి కాలువలను శుభ్రం చేయాలన్నారు.  పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్తపల్లి పంచాయతీ పరిధిలో కూరగాయలు అమ్మే వ్యాపారుల సముదాయాన్ని పరిశీలించారు. పలువురు వ్యాపారులు తమ దగ్గర రోజు రూ. 20 పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు కానీ రశీదులు ఇవ్వడం లేదని పం చాయతీ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. కొత్తపల్లిలో ఉపసర్పంచు రాజేష్‌ మాస్కు ధరించకపోవడంతో రూ. వంద జరిమానాను విధించారు. పలు కిరాణ షాపుల్లోని చెత్తను పరిసరాల్లో వేసినందుకు నలుగురికి జరిమానాలను విధిం చారు. నెలాఖరులోగా డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాల ను పూర్తి చేయాలని ఆదేశించారు. డీఎల్‌పీవో ఫణీందర్‌రావు, ఎంపీవో అక్తర్‌, సర్పంచు రజిత పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T05:48:19+05:30 IST