భయాందోళనలకు గురి చేస్తే కఠిన చర్యలు: డీఎస్పీ

ABN , First Publish Date - 2021-05-17T05:25:18+05:30 IST

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తదితర సోషల్‌ మీడియాలో ప్రజలను భయభ్రాంతులు కలిగించే పోస్టింగులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి హెచ్చరించారు.

భయాందోళనలకు గురి చేస్తే కఠిన చర్యలు: డీఎస్పీ

నంద్యాల, మే 16: ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తదితర సోషల్‌ మీడియాలో ప్రజలను భయభ్రాంతులు కలిగించే పోస్టింగులు పెడితే  కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి హెచ్చరించారు. ఆదివారం నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని సోషల్‌ మీడియాలో జరిగిన ప్రచారంపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌, డీఎస్పీ చిదానందరెడ్డి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ నంద్యాల జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్‌ బాధితుల కోసం 60 బెడ్లు కేటాయించారని, ఈ 60 బెడ్లకు ఆక్సిజన్‌ సదుపాయం ఉందని, అందులో 10 ఐసీయూ బెడ్లు, 50 బెడ్లు నాన్‌ ఐసీయూగా ఉన్నాయని అన్నారు. ఆసుపత్రి ఆవరణలో 6 కేఎల్‌ కెపాసిటీ ఉన్న ఆక్సిజన్‌   ప్లాంట్‌ ఉందని అన్నారు. అందులో  ప్రస్తుతం 1.5 కేఎల్‌ ఆక్సిజన్‌ స్టాక్‌ ఉందని అన్నారు. అత్యవసరం కోసం అదనంగా  50 రీఫిల్స్‌ ఆక్సిజన్‌ కూడా సిద్ధంగా ఉందని అన్నారు. కాగా సోషల్‌ మీడియాలో ఆక్సిజన్‌ కొరత ఉందని కొందరు ప్రచారం చేయడం నిజం కాదని అన్నారు.  అసత్య ప్రచారాలు చేస్తూ పోస్టింగులు పెడితే సెక్షన్‌ 54 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ సమావేశంలో టూటౌన్‌ సీఐ కంబగిరిరాముడు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ జనార్దన్‌, డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ లలిత, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ రాజేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T05:25:18+05:30 IST