విత్తనశుద్ధి కేంద్రంలో నిల్వలను పరిశీలిస్తున్న నాగేశ్వరరావునాణ్యతలేని విత్తనాలు సరఫరా చేస్తే చర్యలు
జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు
ప్రొద్దుటూరు రూరల్, మే 27: మండలంలోని విత్తనశుద్ధి కేంద్రాలు రైతులకు నాణ్యతలేని విత్తనాలు సరఫరా చేస్తే సరఫరాదారునిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి ఎ.నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని అగ్రిటెక్ కేంద్రాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ ప్రాసెసింగ్ చేస్తున్న వేరుశనగ, జీలుగలు,పిల్లిపెసర, జనుములు విత్తనాలను పరిశీలించారు. సబ్సిడీలో అందజేసే ప్రతి విత్తనం కచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రాసెసింగ్ కేంద్రాల యజమానులకు సూచించారు. విత్తన సరఫరాదారులందరూ రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. సబ్సిడీలో సరఫరా చేసిన విత్తనాలను జిల్లాలోని నియోజకవర్గ ల్యాబ్‌లలో కూడా పరీక్ష చేసిన తర్వాత రైతులకు పంపిణీ చేస్తామన్నారు. ఈయన వెంట ఏడీఏ సురే్‌షరెడ్డి, ఏవో శివశంకర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.