ఇచ్ఛాపురం: ఆల యాల స్థలాలను ఆక్ర మించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ కె.శిరీష హెచ్చరిం చారు. బుధవారం ఇ చ్ఛాపురంలోని జగన్నాఽథాలయాన్ని సందర్శించారు. జగన్నాఽథ రథోత్సవ ఏర్పాట్లపై ఆలయ మేనేజర్ బెండ రామారావు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తుల సహకారంతో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. శిథిలావస్థలో ఆలయ భోగశాల పరిశీ లించారు. ఈ వంటగది నిర్మాణానికి గతంలో మంజూరైన నిధులపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం చిన్న జగన్నాఽథాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలను అమర్చాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు ప్రసాదరావు, రమణ, అర్చకులు ఎస్‌ఏ రాంప్రసాద్ సిద్ధాంతి, రామకృష్ణమాచార్యులు, పద్మకుమార్ ఆచార్యులు పాల్గొన్నారు.
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.