Abn logo
Apr 12 2021 @ 23:46PM

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు

బద్వేలు, ఏప్రిల్‌12: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎం తటివారిపైన అయినా చర్యలు తప్పవని తహసీల్దారు శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. బద్వేలు ప్రాం తంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నట్లు సమాచారం రావడంతో అక్కడికెళ్లి పరిశీలించి ఆక్రమణలను తొలగించినట్లు తహసీల్దారు తెలిపారు. మండలంలోని రాజుపాళెం గ్రామం 547/ఎ సర్వేనంబరులో రేకులషెడ్డు నిర్మిస్తుండగా తొలగించి హెచ్చరిక నోటీసుబోర్డు ఏర్పాటు చేశామన్నారు. పుట్టాయపల్లెలోని 365 సర్వేనంబరులో, అలాగే గొడుగునూరు228 సర్వేనంబరులో కంచెను తొలగించినట్లు తహసీల్దారు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement