Abn logo
Sep 28 2021 @ 22:54PM

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

రికార్డులు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

ఎర్రగుంట్ల, సెప్టెంబరు 28: అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం  ఆయన సీడీపీవో సుజామణితో కలిసి ఎర్రగుంట్ల నడివూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీలో రెండు కేంద్రాలను ఒకే ఇంట్లో నిర్వహిస్తుం డడమే కాకుండా  రెండు కేంద్రాలకు కలిసి కేవలం 9మంది చిన్నారులుండడం అక్కడ పనిచేసే ఇద్దరు ఆయాలు, ఒక అంగన్వాడీ కార్యకర్త  లేకపోవడంతో మండిపడ్డారు. రెండు సెంటర్లకు కలిపి ఒక కార్యకర్త మాత్రమే ఉండటమేంటని ప్రశ్నించారు.  రిజిష్టర్‌ను చెక్‌చేసి రిపోర్టు రాయడంతోపాటు వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫోన్‌ ద్వారా కోరారు.  రెండు కేంద్రాలకు సరిపడే పిల్లలు నడివూరులో లేనందున ఇక్కడి నుంచి ఒక కేంద్రాన్ని 13,14వార్డుల్లోకి వెంటనే షిప్ట్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. శాంతినగర్‌ ఒకే అం గన్వాడీ కేంద్రం ఉందని అక్కడ చాలా ఇబ్బందిగా ఉందని ఇక్కడి కేంద్రాన్ని అక్కడికి తరలిస్తే సమతుల్యం అవుతుందని సీడీపీవో  తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి సురేంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.