విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-05-18T05:44:51+05:30 IST

విధుల్లో నిర్లక్ష్యం, అలస త్వం వహించే వైద్యులపై చర్యలు తప్పవని ప్రజారోగ్యశాఖ డైరెక్ట ర్‌ గడల శ్రీనివా్‌సరావు హెచ్చరించారు. వైద్య అధికారులు, సిబ్బందితో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని, పీహెచ్‌సీల్లో ఓపీ సేవలు పెంచాలని సూచించారు. వైద్యులు సమయపాలన తప్పకుండా పాటించాలన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ గడల శ్రీనివా్‌సరావు, పాల్గొన్న కలెక్టర్‌ పమేలాసత్పథి, తదితరులు

సమయపాలన మరవొద్దు 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సేవలు పెరగాలి

ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ గడల శ్రీనివా్‌సరావు


యాదాద్రి, మే 17 (ఆంఽధ్రజ్యోతి): విధుల్లో నిర్లక్ష్యం, అలస త్వం వహించే వైద్యులపై చర్యలు తప్పవని ప్రజారోగ్యశాఖ డైరెక్ట ర్‌ గడల శ్రీనివా్‌సరావు హెచ్చరించారు. వైద్య అధికారులు, సిబ్బందితో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని, పీహెచ్‌సీల్లో ఓపీ సేవలు పెంచాలని సూచించారు. వైద్యులు సమయపాలన తప్పకుండా పాటించాలన్నారు. తాను జిల్లాలోని మూడు ఆస్పత్రులను పరిశీలించానని, ఓపీ రోగులు 30కి మించి లేదని, పీహెచ్‌సీల్లో 50కి పైగా ఓపీ ఉండేలా చూడాలన్నారు. ప్రతినెల హెల్త్‌ ఇండికేటర్స్‌ సమీక్షించుకోవాలని, సాధారణ ప్రసవాలు పెరిగేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో అంటువ్యాధులతోపాటు టీబీ, మలేరియా, డెంగీ కేసులు పెద్దగా లేవని, వీటి నివారణలో జిల్లా వ్యాధుల నివారణ విభాగం మంచి ఫలితాలు సాధిస్తోందన్నారు. టీబీ రోగులకు ఇచ్చే ఇన్సెంటివ్‌ 100శాతం పూర్తి చేస్తామన్నారు. పీహెచ్‌సీల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని, ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించాలన్నా రు. జిల్లాలోనూ సిజేరియన్‌ ఆపరేషన్లు విపరీతంగా పెరిగాయని, వీటిని 20శాతానికి పరిమితం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రు ల్లో 60శాతం ప్రసవాలు, ప్రైవేట్‌లో 40శాతం ఉన్నాయన్నారు. అయితే ప్రభుత్వ ఆస్పతుల్లో సిజేరియన్లు 40శాతం కాగా, ప్రైవేట్‌ మాత్రం 90శాతం వరకు ఉందన్నారు. ప్రతీ ఆపరేషన్‌కు రూ.50 వేల నుంచి రూ.1లక్ష వరకు ప్రైవేటు ఆసపత్రులు బిల్లు వసూలు చేస్తున్నాయని, ప్రైవేటులో సైతం సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ ఉంటోందని, ఆరోగ్య సూత్రాలు పాటించి, వ్యాయా మం చేయాలని సూచించారు. కొవిడ్‌ బాధితుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా జీవన విధానం మార్చుకుని ఆరోగ్యంగా ఉండాలన్నారు. భువనగిరిలో బస్తీ దవాఖానాలు, అన్ని నియోజకవర్గాల్లో డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సమావేశంలో కలెక్టర్‌ పమేలాసత్సథి, అదనపు కలెక్టర్‌,డీఎంహెచ్‌వో డాక్టర్‌మల్లికార్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.


పీహెచ్‌సీల తనిఖీ

ఆలేరు రూరల్‌, యాదగిరిగుట్ట రూరల్‌, రాజాపేట : ఆలే రు మండలంలోని శారాజీపేట, యాదగిరిగుట్ట, రాజాపేట పీహెచ్‌సీలను ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు మంగళవారం ఆకస్మికంగా  తనిఖీచేశారు. ఆస్పత్రుల్లోని రికార్డులను తనిఖీచేసి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందుండాలని సూచించారు. గుట్ట పీహెచ్‌సీలో సాధారణ ప్రసవాల సంఖ్య సంఖ్య పెం చాలని సూచించారు.  రాజాపేటలో వార్డు థియేటర్‌, లేబర్‌రూం తో పాటు ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో డాక్టర్‌ మల్లిఖార్జున్‌రావు, డాక్టర్‌ నవీన్‌కుమార్‌, డాక్టర్‌ వంశీకృష్ణ, సీహెచ్‌వో వెంకన్న, డాక్టర్‌ భరత్‌కుమార్‌, రాజేందర్‌,ప్రేమలత, ఉపేందర్‌, నరేందర్‌, జానకీరాం ఉన్నారు.

Updated Date - 2022-05-18T05:44:51+05:30 IST