విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-12-09T05:59:00+05:30 IST

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ సిరి హెచ్చరించారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
రైతులతో మాట్లాడుతున్న జేసీ

జాయింట్‌ కలెక్టర్‌ సిరి

ఓబుళదేవరచెరువు, డిసెంబరు 8: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ సిరి హెచ్చరించారు. బుధవా రం మండలంలోని కొండకమర్ల ప్రభుత్వ పాఠశాలను, కొండకమర్ల సచివాల యాన్ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. హెడ్‌మాస్టర్‌ మాధవితో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా ఒకొక్క విద్యార్థికి ఎంత మోతాదులో, బేడలు, నూనె, బియ్యం ఇవ్వాలని అడుగగా హెడ్‌మాస్టర్‌ సమాధానం చెప్పక పోవడంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సచివాలయం తనిఖీ చేశారు. సచివాలయంలో పింఛన్‌ దారులు అర్హత, అనర్హత, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాను నోటీసు బోర్డు పై పొందుపరచక పోవడంతో సంబంధిత సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తతో సంపద తయారీ కేంద్రం ఉపయోగం పై ఎంపీ డీఓతో చర్చించి అసహనం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం గ్రీన్‌ అంబాసిడర్‌, గ్రీన్‌గార్డుల హాజరును యాప్‌లో పొందుపరచా లన్నారు. అయినా రెండు రోజులుగా మండల వ్యాప్తంగా యాప్‌లో జీరో చూపు తోందని, ఇలాగైతే ఉద్యోగాలు ఎలా చేస్తారన్నారు. అంతకు మునుపు గంజిబండ తాండా వద్ద ఉపాధి పథకం కింద మామిడితోటలను పరిశీలించారు. అలాగే మండలంలోని కొండకమర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జేసీ అరగంట పాటు టీచరుగా వ్యవహరించారు. పిల్లల సమస్యలు తెలుసుకుని, పాఠ్యాంశాలను బోధిం చి, విద్యార్థులకు ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. పాఠశాల గదిలో తలు పులకు మెస్‌లు ఏర్పాటు చేయక పోవడంతో సంబంధిత హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేసీతో పాటు పాటు తహసీల్దార్‌ స్వర్ణలత, ఎంపీ డీఓ రఘునాథ గుప్తా, ఎంఈఓ చెన్నక్రిష్ణ, ఈఓఆర్‌డీ రాజశేఖర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ ఓబులేసు, స్థానిక సర్పంచు అల్లాపల్లి శ్రావణి, సర్పంచు వెంకటరమణ, ఏపీడీ శివమోహ న్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-09T05:59:00+05:30 IST