అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-05-30T11:14:15+05:30 IST

జిల్లాలోని అన్ని ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ గుర్తింపు పొందిన పాఠశాలలు అధిక ఫీజులను వసూలు చేస్తే కఠిన చర్యలు

అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు

నెల్లూరు (విద్య) మే 29 : జిల్లాలోని అన్ని ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ గుర్తింపు పొందిన పాఠశాలలు అధిక ఫీజులను వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ జనార్ధనాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కారణంగా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే ఫీజులు వసూలు చేయాలని సూచించారు. ఆగస్టు 3న పాఠశాలలు పునఃప్రారంభం తరువాత గత ఏడాది తీసుకున్న ఫీజులనే ఇప్పుడు తీసుకోవాలన్నారు. అదేవిధంగా గత విద్యాసంవత్సరం మొదటి క్వార్టర్‌ ట్యూషన్‌ ఫీజును ఎంత వసూలు చేశారో ప్రస్తుతం కూడా అంతే తీసుకోవాలన్నారు.  తల్లిదండ్రులు కోరిక మేరకు ట్యూషన్‌ ఫీజు ప్రతి నెలా ఫీజు కట్టించుకోవాలని సూచించారు.

Updated Date - 2020-05-30T11:14:15+05:30 IST