ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుంటే చర్యలు

ABN , First Publish Date - 2022-08-12T06:15:50+05:30 IST

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుంటే చర్యలు తప్పవని మంత్రి సురేష్‌ అన్నారు. మండలంలోని తోకపల్లిలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వ కార్య క్రమం నిర్వహించారు.

ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుంటే చర్యలు
వృద్ధురాలిని పరామర్శిస్తున్న మంత్రి

గడప గడపకు మన ప్రభుత్వంలో మంత్రి

పెద్దారవీడు(మార్కాపురం), ఆగస్టు 11: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుంటే చర్యలు తప్పవని మంత్రి సురేష్‌ అన్నారు. మండలంలోని తోకపల్లిలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం ద్వారా ఆయా కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలను గురించి వివరించారు. గ్రామానికి చెందిన మేకల హేమగుప్త తనకు జగనన్న కాలనీలో ప్లాట్‌ నెంబర్‌ 81ని కేటాయించారని, అయితే ఇప్పటి వరకూ అది ఎక్కడ ఉందో చూపించలేదన్నారు. జాజుల నారాయణ తనకు పూర్వీకుల నుంచి వచ్చిన భూములకు రెవెన్యూ అధికారులు పాసుపుస్తకాలు ఇవ్వకుండా తిప్పు కుంటున్నారని మంత్రి సురేష్‌కు పిర్యాదు చేశారు. తనకు పొలం లేకునా తన ఆధార్‌కు 10 ఎకరాల పొలం ఉన్నట్లు ఆన్‌లైన్‌లో నమోదైందని, దీంతో సంక్షేమ పథకాలు తనకు అందడం లేదన్నారు. స్పందించిన మంత్రి సురేష్‌ ప్రభుత్వ పథకాల అమలులో, ఉద్యోగులుగా నిర్వహించాల్సిన విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠి న చర్యలు తప్పవన్నారు. తొలుత రూ.5 లక్షలతో నూతన రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌డీవో సాయికుమార్‌, తహసీల్దార్‌ విడుదల కిరణ్‌, ఏవో బుజ్జిబాయ్‌, విద్యుత్‌ ఏఈ రమేష్‌, ఎంపీపీ బెజవాడ పెద్ద గురవయ్య, జడ్పీటీసీ యేరువ చలమారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ పాలిరెడ్డి కృష్ణారెడ్డి, సర్పంచ్‌ జిల్లెల్ల మల్లేశ్వరి, ఎంపీటీసీ ఉప్పలపాటి భాగ్యరేఖ,  పాల్గొన్నారు. 

శ్మశానం ఏర్పాటు చేయరూ..

గ్రామంలో శ్మశాన వాటిక సమస్య తీవ్రంగా ఉందని ఈ సందర్భంగా గ్రామస్థులు మంత్రి సురేష్‌ దృష్టికి తీసుకొని వచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి గ్రామం శివారులోని కొండపోరంబోకు భూమిని రెవెన్యూ అధికారులతో పరిశీలించారు. ఆ భూమిలో శ్మశానం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా డిప్యూటీ తహసీల్దార్‌ కృష్ణారెడ్డిని ఆదేశించారు.

Updated Date - 2022-08-12T06:15:50+05:30 IST