అనుమతుల్లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-01-17T05:00:26+05:30 IST

మున్సిపాలిటీలో ఎలాంటి అనుమ తులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, అర్బన్‌ సీఐ భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు.

అనుమతుల్లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు

పులివెందుల టౌన్‌, జనవరి 16: మున్సిపాలిటీలో ఎలాంటి అనుమ తులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, అర్బన్‌ సీఐ భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆది వారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజకీయ పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రకటనలకు సంబంధించిన వాటిని ఏర్పాటుచేసే విషయంలో మున్సిపల్‌ కమిషనర్‌ అనుమతి తీసుకొని ఏర్పాటుచేయాలన్నారు. ఎస్‌ఐ చిరంజీవి పాల్గొన్నారు.

లింగాలలో: మండలంలో ఎవరైనా ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలనుకుంటే గ్రామ పంచాయతీ కార్యాలయంలో అనుమతులు తప్పక పొందాలని ఎంపీడీఓ సురేంద్రనాథ్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొనన్నారు. ఇష్ట మొచ్చినట్లు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయ డం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

చక్రాయపేటలో: మండల కేంద్రం తో పాటు గ్రామాలలో ఎవరైనా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేయాలనుకుంటే గ్రామ పంచాయతీ పర్మిషన్‌ తప్పకుండా తీసుకోవాలని ఎంపీడీఓ హైదర్‌అలి, ఈఓపీఆర్డీ గంగులయ్యలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎటువంటి పర్మిషన్‌ లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2022-01-17T05:00:26+05:30 IST