పప్పుశెట్టిపాలెంలో క్వారీని పరిశీలిస్తున్న తహసీల్దార్
తహసీల్దార్ వెంకటేశ్వరరావు
గొలుగొండ, జనవరి 28 : రంగురాళ్ల తవ్వ కాలకు యత్నిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మండలంలోని పప్పుశెట్టిపాలెం వద్ద గల రంగురాళ్ల క్వారీని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వారీతో పాటు పప్పుశెట్టిపాలెంలో 144వ సెక్షన్ అమలులో ఉందన్నారు. క్వారీలో తవ్వకాలు జరపకుండా పోలీస్ సిబ్బందితో పాటు, రెవెన్యూ సిబ్బంది కాపలా ఉన్నట్టు చెప్పారు.