నకిలీ శానిటైజర్లు విక్రయిస్తే చర్యలు

ABN , First Publish Date - 2020-08-09T11:47:25+05:30 IST

నకిలీ శానిటైజర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని వాల్మీకిపురం ఎస్‌ఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

నకిలీ శానిటైజర్లు విక్రయిస్తే చర్యలు

వాల్మీకిపురం, పుంగనూరు రూరల్‌, ఆగస్టు 8: నకిలీ శానిటైజర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని వాల్మీకిపురం ఎస్‌ఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శనివారం పట్టణంలోని మెడికల్‌ షాపులు, సూపర్‌ మార్కెట్లను ఆయన తనిఖీ చేశారు. మాస్కులు లేకుండా ఎలాంటి విక్రయాలు జరపరాదని సూచించారు. అదేవిధంగా పుంగనూరులోని మెడికల్‌ షాపులను ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తనిఖీ చేశారు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, వైద్యసిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రజలకు శానిటైజర్లపై అవగాహన కల్పించాలని కోరారు. 

Updated Date - 2020-08-09T11:47:25+05:30 IST