నకిలీ పురుగు మందులు విక్రయిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-11-28T05:05:05+05:30 IST

నకిలీ పురుగు మందులు విక్రయిస్తే చట్టపర మైన చర్యలు తీసుకుంటామని ఆత్మకూర్‌ మండల వ్యవసాయ విస్తరణ అధికారి జగదీష్‌ అన్నారు.

నకిలీ పురుగు మందులు విక్రయిస్తే చర్యలు
పురుగు మందుల దుకాణంలో తనిఖీ చేస్తున్న ఏఈవో జగదీష్‌

- వ్యవసాయ విస్తరణ అధికారి జగదీష్‌ 


ఆత్మకూర్‌, నవంబరు 27: నకిలీ పురుగు మందులు విక్రయిస్తే చట్టపర మైన చర్యలు  తీసుకుంటామని ఆత్మకూర్‌ మండల వ్యవసాయ విస్తరణ అధికారి జగదీష్‌ అన్నారు. శనివారం ఆత్మకూర్‌లోని పలు పురుగు మందుల దుకాణాల్లో ఆయన తనిఖీలు నిర్వహించారు. మోనోక్రోటోఫాస్‌, క్లోరిపైరిఫాస్‌, సిఫ్రోనిల్‌, ఇమిడాక్లోప్రిడ్‌, ల్యాండ వంటి పురుగు మందుల నమూనాలను సేకరించి హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. నకిలీ పురుగు మం దులు అని రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పురుగు మందులు వాడా లని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు ఉన్నారు. 

Updated Date - 2021-11-28T05:05:05+05:30 IST