అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు

ABN , First Publish Date - 2021-06-17T05:12:24+05:30 IST

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
జమ్మలమడుగు పోలీసు స్టేషన్‌లో సూచనలు ఇస్తున్న సీఐ వెంకటేశ్వర్లు

జమ్మలమడుగు రూరల్‌, జూన్‌ 16: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. బుధవారం జమ్మలమడుగు అర్బన్‌ పోలీసు స్టేషన్‌ ఆవరణలో బైండోవర్‌ కేసులు నమోదు చేసి సూచనలు అందించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జమ్మలమడుగులో ఇటీవల మ ట్కా, గ్యాంబ్లింగ్‌ తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేశామన్నారు. వారం రోజుల్లో సుమారు 25 మందిని  బైండోవర్‌ చేసినట్లు సీఐ తెలిపారు. ఎస్‌ఐలు తిరుపాల్‌నాయక్‌, కల్పన, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-06-17T05:12:24+05:30 IST