త్వరితగతిన మంచినీటి పథకం పనుల పూర్తికి చర్యలు

ABN , First Publish Date - 2022-08-08T05:14:00+05:30 IST

అద్దంకి సమగ్ర మంచి నీటి పథకం పనులు త్వరితగతిన పూర్తి చే సేందుకు చర్యలు చేపడుతున్నట్లు శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌చా ర్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు.

త్వరితగతిన మంచినీటి పథకం పనుల పూర్తికి చర్యలు
ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసి అధికారులతో మాట్లాడుతున్న కృష్ణచైతన్య

 శాప్‌నెట్‌ చైర్మన్‌ కృష్ణచైతన్య

అద్దంకి, ఆగస్టు 7: అద్దంకి సమగ్ర మంచి నీటి పథకం పనులు త్వరితగతిన పూర్తి చే సేందుకు చర్యలు చేపడుతున్నట్లు శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజకవర్గ  ఇన్‌చా ర్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. మంచినీటి పథకం పనులలో భాగంగా స్థానిక మార్కెట్‌ యార్డులో ఏర్పాటుచేయనున్న ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కృష్ణచైత న్య మాట్లాడుతూ మరో ఐదారు నెలలలో మంచినీటి పథకం పనులు పూర్తిచేసి ప్రతి ఇంటికి మంచినీటి సౌక ర్యం కల్పిస్తామన్నారు. భవిష్య త్‌ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో కూడా మంచినీటి పైప్‌లైన్‌లు ఏర్పాటుచేస్తామని చెప్పా రు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ ఎస్తేరమ్మ, వైస్‌ చైర్మ న్‌లు దేసు పద్మేష్‌, అనంతలక్ష్మి, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ రహంతుల్లా జా నీ, డీఈ మనోహరరెడ్డి, ఏఈ రోజా, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, పీడీసీసీ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ సందిరెడ్డి రమేష్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ తిమ్మనబోయిన భువనేశ్వరి, కొల్లా భువనేశ్వరి, కౌన్సిలర్‌లు, తదితరులు పాల్గొన్నారు.


అర్హ్హులందరికీ సంక్షేమ పథకాలు

మేదరమెట్ల, ఆగస్టు 7: అర్హులందరికీ సంక్షే మ పథకాలు అందు తాయని శాప్‌నెట్‌ చైర్మ న్‌, వైసీపీ అద్దంకి నియో జకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. గడప గడప కు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా  ఆదివారం మేదరమెట్లలోని 3వ గ్రామ  సచివాలయం పరిధిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ దళారులతో పని లేకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందిసున్నట్ల్లు చెప్పారు. ముందుగా నిర్ణయించిన తేదీల ప్రకారం సంక్షేమ పథకాలను రైతుల ఖాతాలలో వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బొనిగల ఎలిశమ్మ, వైసీపీ మండల కన్వీనర్‌ సాదినేని మస్తానరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కోయి అంకారావు, పోకూరి హనుమంతరావు (బుల్లోడు ), మన్నె శ్రీను, మెకానిక్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:14:00+05:30 IST