ఇనుప చక్రాలతో ట్రాక్టర్లు వస్తే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2021-07-24T04:59:55+05:30 IST

ఇనుప చక్రాలతో వ్యవసాయం చేసే ట్రాక్టర్లు అదే చక్రాలతో రోడ్డుపై నడిపిస్తే ఇ కపై చర్యలు తప్పవని కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ అన్నారు.

ఇనుప చక్రాలతో ట్రాక్టర్లు వస్తే చర్యలు తప్పవు
సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌

- కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌


నాగర్‌కర్నూల్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఇనుప చక్రాలతో వ్యవసాయం చేసే ట్రాక్టర్లు అదే చక్రాలతో రోడ్డుపై నడిపిస్తే ఇ కపై చర్యలు తప్పవని కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ అన్నారు. శుక్రవా రం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో పోలీస్‌, రోడ్డు, భవనాల శా ఖ, పంచాయతీరాజ్‌ తదితర శాఖాధికారులతో ఈ విషయంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇనుప చక్రాలతో ట్రాక్టర్ల ద్వారా మడికట్లలో దున్నేందుకు వాడే ట్రాక్టర్లు బీటీ రోడ్డు, సీసీ రోడ్డుపై నడపడం వల్ల రోడ్లు ధ్వం సమవుతున్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర  ప్రభుత్వం వీటిని రోడ్డుపై నడపడానికి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసి నట్లు తెలిపారు. అందువల్ల ఎక్కడైనా ఇనుప చక్రాలతో ఉన్న ట్రాక్టర్‌ సీసీ రోడ్డుపై లేదా బీటీ రోడ్డుపై నడిపిస్తే వెంటనే పదివేల రూపా యల జరిమానా విధించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదే శించారు. మొదటిసారి కన్పిస్తే పదివేల రూపాయలు జరిమానా విధించాలని, రెండవ సారి రోడ్డుపై నడిపిస్తే ఆ ట్రాక్టర్‌ యజమానిపై కేసు నమోదు చేయ డమే కాకుండా ట్రాక్టర్‌ను సీజ్‌ చేయాలని ఆదేశించారు. ఇందుకు ప్రతి పంచా యతీ సెక్రటరీ, ఎంపీవోలకు పర్యవేక్షణ చర్యలు తీసుకునే బాధ్యతలు అప్పగి స్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ పంచాయతీ సెక్రటరీ తమ గ్రామంలో ఎన్ని ట్రా క్టర్లున్నాయి, వాటి రిజిస్ర్టేషన్‌ నెంబర్లతో సహా సేకరించి జిల్లా పంచాయతీ అధికారికి అందజేయాలని తెలియజేశారు. జరిమానా విధించడం, కేసులు బుక్‌ చేసే బాధ్యతలు పంచాయతీ సెక్రటరీలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు జిల్లాలో ఎక్కడా ఉల్లంఘన కాకుండా పోలీస్‌, జిల్లా పంచాయతీరాజ్‌, ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, మునిసిపాలిటీ తది తర శాఖలు బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదే విషయంపై ప్రజల కు అర్థమయ్యే విధంగా ప్రతి గ్రామంలో, మండలంలో, మునిసిపాలిటీలో వి స్తృత ప్రచారం చేయాలని, ఊర్లలో టాంటాం చేయించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి రాజేశ్వరి, డీఎస్పీ మోహ న్‌రెడ్డి, జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి ఎర్రిస్వామి, ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యనిర్వాహక ఇంజనీరు దామోదర్‌రావు, ఆర్‌అండ్‌బీ ఈఈ భాస్కర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-24T04:59:55+05:30 IST