పల్లె, పట్టణ ప్రగతి పనులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2021-06-22T05:30:00+05:30 IST

పలె,్ల పట్టణ ప్రగతి పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

పల్లె, పట్టణ ప్రగతి పనులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అల్లోల

గ్రామాలు, మున్సిపాలిటీలు పచ్చదనంతో కళకళలాడాలి

ప్రభుత్వ నూతన చట్టాలు పకడ్బందీగా అమలు

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌, జూన్‌ 22 ( ఆంధ్రజ్యోతి ) : పలె,్ల పట్టణ ప్రగతి పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్‌లో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం, పరిశుభ్రత తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమా వేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే పలె,్ల పట్టణ ప్రగతిలో గ్రామాలు, మున్సిపాలిటీలు పచ్చ దనంతో కళకళలాడాలన్నారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడకుండా త్వర గా పూర్తి చేయాలన్నారు. రైతులు అనుమతి గల దుకాణాల్లో ఎరువులు, విత్తనా లు కొనాలన్నారు. నకిలీపత్తి విత్తనాల నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డంపింగ్‌ యార్డ్‌లు, వైకుంఠధామాలు, పల్లెప్రగతి వనాలు నూటికి నూరుశాతం పూర్తి కావడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం కనబడుతుందన్నారు. పల్లె, పట్టణ ప్రగతి అమలుకై ప్రత్యేకంగా అదనపు కలెక్టర్‌లను నియమించిందన్నారు. చేపట్టిన పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకస్మికంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. హరితహరంలో నాటిన మొక్కలను సరంక్షించడం, మున్సిపల్‌తో పాటు సర్పంచ్‌, గ్రామ కార్యదర్శులదే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అందరి సహకారంతో జిల్లాకు మంచి పేరు వచ్చేలా ముందుకు పోదామన్నారు. నూతన చట్టం ప్రకారం 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌కు వినియోగించాలని స ఊచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T05:30:00+05:30 IST