కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2021-05-09T05:47:48+05:30 IST

కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా నియంత్రణలో భా గంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని మాస్కులు తప్పకుండా ధరించాలని లేనిపక్షంలో శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అర్వింద్‌బా బు హెచ్చరించారు.

కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు

ఖిల్లా, మే 8: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి  ఒక్కరూ కరోనా నియంత్రణలో భా గంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని మాస్కులు తప్పకుండా ధరించాలని లేనిపక్షంలో శాఖాపరమైన కఠిన చర్యలు ఉంటాయని డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అర్వింద్‌బా బు హెచ్చరించారు. కరోనా సెకండ్‌వేవ్‌ కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుందని దాని ని అరికట్టించేందుకు జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్‌, గాంధీచౌక్‌, వేణుమాల్‌, చెన్నైషాపింగ్‌మాల్‌, సుల్తాన్‌ వంటి రద్దీగా ఉండే వ్యాపార సముదాయాల్లో శనివారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని ఆరాతీశారు. ప్రజలు మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించేవిధంగా చర్యలు చేపట్టాలని వ్యాపార సముదాయాల నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కరోనా కేసులను తగ్గించడం లక్ష్యంగా పలు చర్యలను తీసుకుంటున్నామన్నారు. ప్రజలు సైతం పోలీసుశాఖకు, ప్రభుత్వానికి సహకరించి కేసుల సంఖ్య తగ్గించడానికి కృషి చేయాలన్నారు. జిల్లాలో కరోనాకేసులపై అప్రమత్తంగా ఉంటూ అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనుమతులు లేకుండా ఎ లాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించారు. అన్ని రకాల పండుగ లు, ఆద్యాత్మిక కార్యక్రమాలపై ఈ నెల 15 వరకు ఆంక్షలు విధించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పోలీసుశాఖ కరోనా నియంత్రణకు కృషి చేస్తుందన్నారు. నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు నగరంలోని ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:47:48+05:30 IST