విజయవాడ: ఎస్ఎస్సీ బోర్డులో ఉద్యోగులను వేధింపులకు గురి చేసిన అడిషనల్ డైరెక్టర్ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు పడింది. ఈయన స్థానంలో ఏపీ ఎంఎస్ జాయింట్ డైరెక్టర్ కె.రవీంద్రనాథ్ రెడ్డిని ఇన్చార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగిపై చేయి చేసుకోవడం, కొందరిని సస్పెండ్ చేయడంతో బోర్డులో సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉద్యమించారు. మరోవైపు సుబ్బారెడ్డి.. మహిళా ఉద్యోగులను సైతం వేధింపులకు గురి చేశారంటూ.. మహిళా కమిషన్, దిశ పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఉద్యోగుల ఆందోళనలపై.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలను ప్రచురించింది. ఈ విషయంలో ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చి.. బదిలీ వేటు వేసింది.