ఏఆర్‌ ఆర్‌ఐ హరికృష్ణపై చర్యలు

ABN , First Publish Date - 2022-08-10T05:41:30+05:30 IST

మహిళా హోంగార్డుపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఏఆర్‌ విభాగం ఆర్‌ఐ హరికృష్ణను అదనపు విధుల నుంచి తొలగించారు.

ఏఆర్‌ ఆర్‌ఐ హరికృష్ణపై చర్యలు

అదనపు బాధ్యతల నుంచి తొలగింపు

- ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

అనంతపురం క్రైం, ఆగస్టు 9: మహిళా హోంగార్డుపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఏఆర్‌ విభాగం ఆర్‌ఐ హరికృష్ణను అదనపు విధుల నుంచి తొలగించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో మంగళవారం ప్రచురితమైన ‘నా నెంబర్‌ తీసుకో’ కథనానికి జిల్లా పోలీస్‌ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ ఘటనపై డీఐజీ రవిప్రకాష్‌, జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప సీరియస్‌ అయినట్లు తెలిసింది. విచారించిన ఉన్నతాధికారులు.. ఆర్‌ఐ హరికృష్ణపై మండిపడినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆర్‌ఐ పర్యవేక్షిస్తున్న హోంగార్డుల ఇనచార్జ్‌, అడ్మిన, స్పెషల్‌ పార్టీ ఇనచార్జ్‌ల విభాగాల విధుల నుంచి తొలగించారు.  ఈ బాధ్యతలు ఆర్‌ఎ్‌సఐ రాజశేఖర్‌రెడ్డికి అప్పగించాలని భావించినట్లు తెలిసింది. ఇందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో ఎవరికి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నతాధికారులు సందిగ్ధంలో పడినట్లు సమాచారం. ఆర్‌ఐ హోదా బాధ్యతలు ఆర్‌ఎ్‌సఐకి అప్పగిస్తే సైతం విమర్శలు వ్యక్తమవుతాయనే నేపథ్యంలో మరో ఆర్‌ఐకే ఆ బాధ్యతలు అప్పగించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2022-08-10T05:41:30+05:30 IST