అందరికీ టీకాలు వేసేలా చర్యలు

ABN , First Publish Date - 2021-06-21T02:32:01+05:30 IST

అర్హత కలిగిన అందరికి కొవిడ్‌ టీకాలు వేసేలా చర్యలు తీసుకున్నట్లు సబ్‌కలెక్టర్‌ బాపిరెడ్డి తెలిపారు.

అందరికీ టీకాలు వేసేలా చర్యలు
సిబ్బందితో మాట్లాడుతున్న సబ్‌కలెక్టర్‌ బాపిరెడ్డి

గూడూరురూరల్‌, జూన్‌ 20: అర్హత కలిగిన అందరికి కొవిడ్‌ టీకాలు వేసేలా చర్యలు తీసుకున్నట్లు సబ్‌కలెక్టర్‌ బాపిరెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌, సీఎస్‌ఎం పాఠశాలలోని టీకా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 45 ఏళ్లు దాటిన వారికి, ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులకు టీకాలు వేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

వ్యాక్సిన్‌ టార్గెట్‌ పూర్తిచేయాలి

చిల్లకూరు: కొవిడ్‌ మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా గూడూరు డివిజన్‌లోని పీహెచ్‌సీలు టార్గెట్‌ను పూర్తిచేయాలని ట్రైనీకలెక్టర్‌ సల్మాన్‌అహ్మద్‌ఖాన్‌, సబ్‌కలెక్టర్‌ బాపిరెడ్డి సూచించారు. ఆదివారం స్థానిక పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని  పరిశీలించారు. గూడూరు డివిజన్‌లో సాయంత్రానికి 12,350 మందికి టీకాలు వేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు గీతావాణి, డాక్టర్‌ బ్రిజిత, హెల్త్‌సూపర్‌వైజర్‌ రవికుమార్‌, ఆర్‌ఐ చైతన్య, ఉమాపతి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-21T02:32:01+05:30 IST