యశోద హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలి: డీవైఎఫ్‌ఐ

ABN , First Publish Date - 2020-07-12T01:26:18+05:30 IST

కరోనా చికిత్స పేరుతో దోపిడీ చేస్తున్న యశోద హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్

యశోద హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలి: డీవైఎఫ్‌ఐ

హైదరాబాద్: కరోనా చికిత్స పేరుతో దోపిడీ చేస్తున్న యశోద హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ అరికట్టాలని, వాటి అనుమతులు రద్దు చేయాలని విజయ్‌కుమార్ కోరారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ యశోద హాస్పిటల్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ యశోద, కేర్, కిమ్స్, తుంబే, సన్ షైన్, అంకుర హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ హాస్పిటల్స్ అడ్డగోలుగా ఫీజులు వేసి రోగుల్ని దోపిడీ చేస్తున్నాయని మండిపడ్డారు. కరోనా పాజిటివ్ రాకున్న ఇతర రోగాల పేరుతో చేరితే కూడా ఫీజులు బాదుతున్నారని, రోజుకు లక్ష ఎట్లా ఖర్చు అవుతుందో ప్రజలకు చెప్పాలని విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-07-12T01:26:18+05:30 IST