BA పరీక్షల్లో విఫలం... విమాన సిబ్బందిపై చర్యలు

ABN , First Publish Date - 2022-05-11T01:29:45+05:30 IST

నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో... ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ కాలంలో... 48 మంది సిబ్బందిపై డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) చర్యలు తీసుకుంది.

BA పరీక్షల్లో విఫలం...  విమాన సిబ్బందిపై చర్యలు

ముంబై : నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో... ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ కాలంలో... 48 మంది సిబ్బందిపై డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) చర్యలు తీసుకుంది. తొమ్మిది మంది పైలట్లతో పాటు 32 మంది  క్యాబిన్ సిబ్బందికి బ్రీత్ ఎనలైజింగ్ పరీక్షలో పాజిటివ్‌ ఫలితాలొచ్చాయి. వీరిలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు క్యాబిన్‌ సిబ్బందికి సంబంధించిన ఫలితాలు రెండోసారి పాజిటివ్‌గా ఉండటంతో మూడేళ్లపాటు సస్పెండ్‌ అయ్యారు. మిగిలిన ముప్పై-ఏడు మంది సిబ్బందిని మొదటిసారిగా BA పాజిటివ్‌గా పరీక్షించినందుకు మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. విమానయాన సంస్థలు తమ కాక్‌పిట్, క్యాబిన్-క్రూ సభ్యుల్లో 50 శాతం మందిని రోజూ ప్రీ-ఫ్లైట్ ఆల్కహాల్ పరీక్షలు చేయించుకోవాలని డీజీసీఎ కిందటి నెలలో ఆదేశాలు జారీ చేసింది.

Read more