Abn logo
Jun 7 2020 @ 05:38AM

పారిశుధ్యలోపం తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్‌ ముషారప్‌ఆలీపారుఖీ


ముథోల్‌, జూన్‌ 6 : పారిశుధ్ద్యలోపం తలెత్తకుండా చర్యలు చేపలట్టాలని  నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారప్‌ ఆలీ పారుఖీ అన్నారు.  మండలంలోని విట్టోలి, కారేగాం గ్రామాలల్లో శనివారం పల్లెప్రగతి పనులను తనిఖీ చేశారు. విట్టోలి గ్రామంలో మురికి కాలువలను పరిశీలించారు. మురికికాలువలో పూడిక ఉండటంపై పంచాయతీ కార్య దర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు, మురికికాలువలో పూడికను తొలగించాలని  సూచిం చారు, అనంతరం  గ్రామంలో నర్సరీని పరిశీలించారు. గ్రామంలో ప్రతీ ఒకరూ మాస్కులు ధరించేలా అవగహన కల్పించాలన్నారు. 


కారేగాం గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయితీ కార్యాలయంను పరిశీలించారు. కార్యాలయం పక్కన గల కాలువలో ఉన్నపూడికను తొలగించాలని ఆదేశించారు. మురికికాలువలో నీరు నిలువ ఉండాకుండా దోమల నివరణకు తగుచర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు, అనంతరం గ్రామంలో వైకుంఠదామం. డపింగ్‌యాడ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  ఆర్డీవో రాజు, తహసిల్ధార్‌ లోకేశర్‌రావు . జడ్పీటీసి సరోజన. యంపీపీ ఆయిషాఖానీజ్‌, యంపీ డీవో నూర్‌మహ్మద్‌ , సర్పంచ్‌లు కీర్తనరెడి,్డ సత్తయ్యగౌడ్‌ ఉన్నారు.

Advertisement
Advertisement