వేతనాల చెల్లింపుల్లో జాప్యంపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-08-10T10:57:06+05:30 IST

వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశుసంక్షేమశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో జాప్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ..

వేతనాల చెల్లింపుల్లో జాప్యంపై చర్యలు తీసుకోవాలి

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 9 : వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశుసంక్షేమశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల చెల్లింపుల్లో జాప్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు విను కొండ రాజారావు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఒంగోలులోని సంఘ కార్యా లయంలో  ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల్లో పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాల అమలు చే స్తున్న ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా  వ్యవహరించడం  తగదన్నారు. క్షేత్రస్థా యిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు చెల్లింపు చేయాల్సి ఉందని, కానీ అందుకు భిన్నంగా జిల్లాలో ఆయాశాఖల అధికారులు వ్యవ హరిస్తున్నారని ఆరోపించారు.  ఇప్పటికైనా ఉన్నతాదికారులు జోక్యం చేసుకొ ని వెంటనే వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2020-08-10T10:57:06+05:30 IST