గుర్తింపులేని schoolsపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-05T18:26:01+05:30 IST

హైదరాబాద్‌(hyderabad) జిల్లాలో గుర్తింపులేని ప్రైవేట్‌ పాఠశాలల(Private schools)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీఎస్‌ఎస్‌ఓ రాష్ట్ర

గుర్తింపులేని schoolsపై చర్యలు తీసుకోవాలి

చాంద్రాయణగుట్ట, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌(hyderabad) జిల్లాలో గుర్తింపులేని ప్రైవేట్‌ పాఠశాలల(Private schools)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీఎస్‌ఎస్‌ఓ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నివాసు డిమాండ్‌ చేశారు. గురువారం మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యను వ్యాపారంగా చేసుకుని ప్రతిపాఠశాలలో అధిక ఫీజులువసూలు చేస్తున్నారని, నోట్‌బుక్స్‌(note books) కూడా పాఠశాలలోనే అమ్ముతున్నారన్నారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దోచుకుంటున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. డీఈఓ, ఎంఈఓలపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్‌ఎస్‌ఓ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేశ్‌, రాష్ట్ర నాయకులు బెస్తయాదగిరి, శివ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-05T18:26:01+05:30 IST