చెరువు కట్టను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-24T04:30:09+05:30 IST

నమ్మ చెరువు కట్ట ను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని అఖి ల పక్ష నాయకులు డిమాండ్‌ చేశారు .

చెరువు కట్టను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి
తహసీల్దార్‌కు వినతి పత్రం అందిస్తున్న అఖిల పక్ష నాయకులు

-  అఖిల పక్ష నాయకుల డిమాండ్‌ 

- తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన 

వనపర్తి రూరల్‌, జూన్‌ 23: నమ్మ చెరువు కట్ట ను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని అఖి ల పక్ష నాయకులు డిమాండ్‌ చేశారు . బుధవారం తహసీల్దార్‌ కార్యాలయంలో కింద కూర్చొని అఖిల పక్ష నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంత రం వారు మాట్లాడుతూ పట్టణంలోని సర్వే నెంబర్‌ 1167లో గల చెరువు కట్టను మునిసిపల్‌ వైస్‌ చైర్మ న్‌ తొలగించాడని అఖిలపక్షం ఆధారాలతో సహా రుజువు చేసిందన్నారు. అయినా ఇంతవరకు ఎందు కు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కుంట కట్టను ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకు నేంత వరకు పోరాటం ఆగదని, రానున్న రోజుల్లో ప్రజా సంఘాలను, మేధావులను, మిగత రాజకీయ పార్టీలను కలుపుకొని ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో తహసీల్దార్‌ రాజేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ ఇరిగేషన్‌ అధికారుల తో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అనంతరం తహ సీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఖాదర్‌ పాషా, కాంగ్రెస్‌ మాజీ కౌన్సిలర్‌ సతీష్‌ యాదవ్‌, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఖయ్యూం, టీవైఎస్‌ఆర్‌ జిల్లా ఇన్‌చార్జి  మధులత, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రామ్మోహన్‌, టీడీపీ రాష్ట్ర నాయ కుడు ఏర్పుల రవి యాదవ్‌, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T04:30:09+05:30 IST