అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలుపుతున్న ఆలిండియా సమత సైనిక్ దళ్ నాయకులు
దేవరకొం డ, మే 25: కో నసీమ ఘటన లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలిండియా సమత సైనిక్దల్ రాష్ట్ర కార్యదర్శి బుర్రి వెం కన్న డిమాండ్ చేశారు. దేవరకొండలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆలిండియా సమత సైనిక్దళ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపి మాట్లాడారు. భారత రాజ్యాంగంలో అందరికీ స మాన హక్కులను కల్పించిన బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును జిల్లాకు పెట్టడాన్ని కోనసీమ వ్యక్తులు నిరసన తెలపడం సరికాదన్నారు. అంబేడ్కర్ పేరును వ్యతిరేకించడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఆలిండియా సమత సైనిక్దళ్ నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, ప్రవీన, సైదులు, గోపాల్ పాల్గొన్నారు.