సబ్‌ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-09-20T07:44:46+05:30 IST

సర్వే నెంబర్‌ 68/44లో అక్రమ రిజిస్ర్టేషన్‌ బాధితులకు న్యాయం చేయడంతో పాటు నకిలీ పట్టదారుగా జంగిలి ఆశన్నను వాడుకొని మోసగించిన సబ్‌రిజిస్ర్టార్‌పై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జిల్లా నాయకులు శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు...

సబ్‌ రిజిస్ట్రార్‌పై చర్యలు తీసుకోవాలి

కలెక్టర్‌రేట్‌ ఎదుట దళిత సంఘాల నాయకుల ధర్నా


ఆదిలాబాద్‌టౌన్‌, సెప్టెంబరు 19: సర్వే నెంబర్‌ 68/44లో అక్రమ రిజిస్ర్టేషన్‌ బాధితులకు న్యాయం చేయడంతో పాటు నకిలీ పట్టదారుగా జంగిలి ఆశన్నను వాడుకొని మోసగించిన సబ్‌రిజిస్ర్టార్‌పై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జిల్లా నాయకులు శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దళిత మహిళా నాయకురాలు  మాట్లాడుతూ సర్వే నెం.68/44లో జంగిలి ఆశన్నకు ప్రభుత్వ రికార్డు ప్రకా రం గుంట భూమి కూడా లేదని, అయితే సర్వే నెం.21లో జంగిలి హన్మంత్‌కు ఐదు ఎకరాల భూమి ఉందన్నారు. కాగా, జంగిలి ఆశన్న పేరుమీద 68/44లో ఐదు ఎకరాల భూమి ఉన్నట్లు నకిలీ దస్తావేజులు సృష్టించారని,   సబ్‌రిజిస్ర్టార్‌ ద్వారా ఆశన్న పట్టేదార్‌ నుంచి మరో నలుగురికి జీపీఏ ద్వారా భూమి బదలాయించారని అన్నారు. ఈ విషయంలో జంగిలి ఆశన్న రిజిస్ర్టేషన్‌ ఆఫీసుకు కూడా వెళ్లలేదని, ఆయన ఇంటికే అధికారులు వచ్చి సంతకా లు తీసుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జంగిలి ఆశన్నను వాడుకొ ని భూ బదలాయింపులో అవినీతి అక్రమాలకు పాల్పడిన సబ్‌రిజిస్ర్టార్‌పై చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా ఇందులో మరికొంత మంది బాధితు లు ఉన్నారని, వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు స్వరూప, రమా, నందిని,నారాయణ, రాధా, వైష్ణవి, మంగళ, జ్యోతి, సృజన తదితరులు పాల్గొన్నారు.


డాక్టర్‌ వేధింపులను నిరసిస్తూ..

అలాగే, జిల్లాలోని గుడిహత్నూర్‌ పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న నర్సులు, ఫీమెల్‌ స్టాఫ్‌పై రెండేళ్లుగా డాక్టర్‌ వేధింపులకు గురిచేస్తున్నారని,  వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని శనివారం పీహెచ్‌సీ నర్సులు, ఫీమెల్‌ స్టాఫ్‌ జిల్లాకేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత పీహెచ్‌సీ సిబ్బంది మాట్లాడుతూ సక్రమంగా విధులు నిర్వహిస్తున్నామని, అయినా సదరు వైద్యుడు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నా రు. వైద్యాధికారి మాటతీరు, సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న తీరుతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. తాము వైద్యాధికారి తీరుతో సరిగా పనిచేయలేక పోతున్నామని వాపోయారు. అలాగే  సబ్‌సెంటర్‌ నిధులను కాజేస్తూ, అజామాయిషీ చెలాయిస్తున్న వైద్యుడితో పాటు సూపర్‌వైజర్‌లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇందులో ఏఎన్‌ఎంలు సంధ్యదేవి, శారద, శత్రజ్ఞ, నర్సమ్మ, తూర్పుబాయి, కృష్ణ, రాధా, సునిత, ఏజాజ్‌ఖాన్‌, పసినా, ఆనంద, శ్రీనివాస్‌, గుడిహత్నూర్‌, సీతాగొందీ, తోషం, మన్నూర్‌, శాంతాపూర్‌, కొల్హార, ముత్నూర్‌కు చెందిన తదితర సెంటర్లకు చెందిన సిబ్బంది, స్టాఫ్‌ నర్సులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-20T07:44:46+05:30 IST