స్టాఫ్‌నర్సుపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-10T05:10:29+05:30 IST

డెలివరీ చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు మృతికి కారణమైన స్టాఫ్‌ నర్సుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం మండల పరిధిలోని భైరవునిపల్లి గ్రామానికి చెందిన వారు నేలకొండపల్లి సీహెచ్‌సీ ముందు ధర్నాకు దిగారు.

స్టాఫ్‌నర్సుపై చర్యలు తీసుకోవాలి

నేలకొండపల్లిలో మృత శిశువుతో బంధువుల ధర్నా 

నేలకొండపల్లి, ఆగస్టు9: డెలివరీ చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు మృతికి కారణమైన స్టాఫ్‌ నర్సుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం మండల పరిధిలోని భైరవునిపల్లి గ్రామానికి చెందిన వారు నేలకొండపల్లి సీహెచ్‌సీ ముందు ధర్నాకు దిగారు. డాక్టర్‌ రాజేష్‌, ఎస్సై స్రవంతిలు వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపి ధర్నా విరమింపచేశారు... భైరవునిపల్లికి చెందిన శొంఠి కార్తీక్‌ తన భార్య సింధును ప్రసవానికి ఆదివారం మధ్యాహ్నం నేలకొండపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చాడు. కానీ రాత్రి వరకు కాన్పు చేయకపోవటంతో తాము ఖమ్మం వెళతామని కార్తీక్‌ సిబ్బందితో చెప్పి, అంబులెన్సును తీసుకొచ్చాడు. సిబ్బంది ఇక్కడే కాన్పు చేస్తామని ఖమ్మం అవసరం లేదని చెప్పారు. కాన్పు అనంతరం శిశువు పరిస్ధితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యసిబ్బంది అంబులెన్స్‌ను పిలిచి ఖమ్మం పంపారు. ఖమ్మంలో పిల్లల వైద్యుడు శిశువును పరీక్షించి మృతి చెందినట్లు చెప్పారు. ఆదివారం సంఘటన జరగ్గా మంగళవారం శిశువు మృతికి కారణమైన స్టాఫ్‌ నర్సుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ  కార్తీక్‌ బంధువులు నేలకొండపల్లి ప్రభుత్వ వైద్యశాల ముందు ధర్నాకు దిగారు. డాక్టర్‌ రాజేష్‌, ఎస్సై స్రవంతిలు ఆందోళనకారుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. బుధవారం సూపరింటెండెంట్‌ వచ్చి మాట్లాడతారని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. శొంటి కార్తీక్‌, మరికంటి రేణుబాబు, పెద్దపాక వెంకటేశ్వర్లు, పగిడికత్తుల ఈదయ్య, మల్లెబోయిన శ్రీనివాసరావు, బోయిన వేణు, రవి, శ్రీకాంత్‌తదితరులు పాల్గొన్నారు.

మాతప్పు లేదు....

వైద్యాధికారి  రాజేష్‌

శిశువు మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణం కాదని ఆసుపత్రి వైద్యాధికారి రాజేష్‌ చెప్పారు. డెలివరీ సమయంలో తొలుత ముఖం బయటకు రావటంతో శిశువు మట్టు, ఉమ్మ నీరు మింగేసిందన్నారు.  

Updated Date - 2022-08-10T05:10:29+05:30 IST