Abn logo
May 22 2020 @ 05:54AM

అధికారులపై చర్యలు తీసుకోవాలి

ఏపీఎండీసీ యాజమాన్యానికి ఫిర్యాదు


ఓబులవారిపల్లె, మే21 : బెరైటీస్‌ ఖనిజ ఆధారిత చిన్న పరిశ్రమలైన పల్వరైజింగ్‌ మిల్లులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీఎండీసీ యాజమాన్యానికి బుధవారం మంగంపేట బెరైటీస్‌ పల్వరైజింగ్‌ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.


ఈ సందర్భంగా పల్వరైజింగ్‌ మిల్లుల యజమానుల సంఘం ప్రతినిధులు పులపత్తూరు రామసుబ్బారెడ్డి, గజ్జల శ్రీనివాసులరెడ్డిలు జీఎం సుదర్శన్‌రెడ్డితో మాట్లాడుతూ బెరైటీస్‌ సరఫరాలో గానీ, స్పెసిఫిక్‌ గ్రావిటీ, సమాచారం ఇచ్చే విషయంలోగాని పల్వరైజింగ్‌ మిల్లు యజమానులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఏపీఎండీసీలో మార్కెటింగ్‌ అధికారి కొంత మందికి వ్యాపారులకు లబ్ధికలిగేలా అగ్రిమెంట్‌ కానటువంటి ప్రీమియం గ్రేడు డీవో ఇచ్చారని ఫిర్యాదు చేశారు. అగ్రిమెంట్‌ అయిన మిల్లులకు 4.28 స్పెసిఫిక్‌ గ్రావిటీ ఖనిజం ఇవ్వాల్సి ఉండగా 4.25గ్రావిటీ కలిగిన ఖనిజం ఇస్తున్నారన్నారు. దీంతో పాటు 4.13స్పెసిఫిక్‌ గ్రావిటీ బదులు 4.10గ్రావిటీ ఖనిజం ఇస్తూ మిల్లు యజమానులను నష్టపరుస్తున్నట్లు వివరించారు. 

Advertisement
Advertisement
Advertisement