అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-06-26T06:40:46+05:30 IST

విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూళ్లు చేస్తూ పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలను వి క్రయిస్తున్న కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేసి వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర సం యుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు డిమాండ్‌ చేశారు.

అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
పాఠ్యపుస్తకాల గదిని సీజ్‌ చేస్తున్న ఎంఈవో నర్సింహ

నల్లగొండటౌన, జూన 25: విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూళ్లు చేస్తూ పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలను వి క్రయిస్తున్న కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల గుర్తింపును రద్దు చేసి వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర సం యుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్‌ రోడ్డులో గల నారాయణ పాఠశాల ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. ధనార్జనే ధ్యే యంగా డొనేషన్లు, స్పెషల్‌ ఫీజులు, బస్సు ఫీజులు, యూనిఫాం, పుస్తకాల ఫీజులని వివిధ రకాల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా జీవో 91 ప్రకారం కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలు టెక్నో, ఈటెక్నో, డీజీ, టాలెంట్‌, ఒలంపియాడ్‌ అనే పేర్లతో పాఠశాలలు నడపవద్దని, పాఠ్యపుస్తకాలను అమ్మవద్దని ఉన్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. విషయం తెలుసుకున్న ఎం ఈవో నర్సింహ అక్కడికి చేరుకుని పాఠశాలలో పాఠ్య పుస్తకాలను విక్రయిస్తున్న గదిని సీజ్‌ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ ఆవుల సంపత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్స ప్రశాంత కు మార్‌, జోనల్‌ ఇనచార్జిలు తోగిటి అనుదీప్‌, నల్లా వంశీ, గంగాదేవి, శ్రావణ్‌, వనవాసి, కన్వీనర్‌ నాగేందర్‌, నగర ఉపాధ్యక్షుడు పకీర్‌ మధు, జయంత, సాయి, వంశీకృష్ణ, శివ పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-06-26T06:40:46+05:30 IST