కబ్జాలపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-05T05:46:34+05:30 IST

పట్టణంలో వివిధ ప్రదేశాల్లో వైసీపీ నాయకులు కబ్జాలు చేశారని... అధికారులు నోటీసులు అందజేయడంతోనే సరిపెట్టి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని... ఇది సరికాదని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు.

కబ్జాలపై చర్యలు తీసుకోవాలి
కోర్లకుంట మరువ పారుతుతహసీల్దార్‌ ముకుందతో చర్చిస్తున్న మాజీ ఎమ్మెల్యే కందికుంట



తహసీల్దార్‌కు కందికుంట వినతి

కదిరి, ఆగస్టు 4: పట్టణంలో వివిధ ప్రదేశాల్లో వైసీపీ నాయకులు కబ్జాలు చేశారని... అధికారులు నోటీసులు అందజేయడంతోనే సరిపెట్టి కబ్జాలను  ప్రోత్సహిస్తున్నారని... ఇది సరికాదని మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. ఆయన గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వెళ్లారు. కంది కుంట నారాయణమ్మ కాలనీపై పులివెందుల వాసుల దౌర్జన్యంపై తహసీల్దార్‌ ముకుందకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కందికుంట నారాయణమ్మ కాలనీ ఏర్పడి 16 సంవత్సరాలకు పైగా అయిందని తెలిపారు. అప్పట్లో భూమి అమ్మిన వ్యక్తి మరో సర్వే నెంబర్‌ వేసి స్థలాలు రిజిస్టర్‌ చేయించార ని తెలిపారు. అప్పటినుంచి అక్కడ ఎంతోమంది పేద, మధ్యతరగతి వారు నివాస ముంటున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో కదిరిలోని కొంతమంది వైసీపీ నాయకు లు, పులివెందులకు సంబంధించిన వ్యక్తులు వచ్చి... తాము ఈ భూమిని కొనుగోలు చేశామని, డబ్బులు కట్టి రిజిస్టర్‌ చేయించుకోవాలని దౌర్జన్యం చేస్తున్నట్లు తహసీ ల్దార్‌కు వివరించారు. ఇప్పటికే పలుమార్లు పులివెంధుల వాసులు మనుషులతో వచ్చి బెదిరించారన్నారు. బుధవారం కూడా ఇదే పని చేశారని పేర్కొన్నారు. తమ ఆస్థిని కాపాడుకోవడానికి నారాయణమ్మ కాలనీవాసులు తమ వద్దకు వచ్చారని,   వారికి అండగా ఉంటామన్నారు. ప్రభుత్వ అఽధికారులు భూమిని పరిశీలించకుండా ఎనఓసీ ఇచ్చారని, ఇది వారి నిరక్ష్యానికి నిదర్శనమన్నారు. అలాగే పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో వైసీపీ నాయకులు కబ్జా చేసి, బేసిమట్టాలు వేస్తే, అధికారులు వాటిని తొగించకుండా, నోటీసులివ్వడం కబ్జాలను ప్రోత్సహిం చడమే నన్నారు. అలాగే 206 సర్వే నెంబరులో రాత్రికి రాత్రే కట్టడాలు కడితే కూల్చకుండా వదిలివేయడం కూడా కబ్జాల ప్రోత్సహం కిందికి వస్తుందన్నారు. ఈకబ్జాలపై అధికారులు చర్యలు తీసుకోకపోతే తాము ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఆయనతోపాటు పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-05T05:46:34+05:30 IST