‘నారాయణపేట్‌ కలెక్టర్‌, ఎస్పీలపై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2021-10-29T05:11:04+05:30 IST

‘నారాయణపేట్‌ కలెక్టర్‌, ఎస్పీలపై చర్యలు తీసుకోవాలి’

‘నారాయణపేట్‌ కలెక్టర్‌, ఎస్పీలపై చర్యలు తీసుకోవాలి’
తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న ప్రజాసంఘాల నాయకులు

బొంరాస్‌పేట్‌: ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులపట్ల ఉదాసీనత వైఖరి అవలంభిస్తున్న నారాయణపేట్‌ కలెక్టర్‌, ఎస్పీలపై చర్యలు తీసుకోవాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు గురువారం బొంరాస్‌పేట్‌ తహసీల్దార్‌ షాహేదాబేగంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కొత్తూర్‌చంద్రయ్య మాట్లాడుతూ నారాయణపేట్‌ జిల్లాలో దళితులపై జరిగిన దాడులను ఖండించారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాసంఘాల నాయకులు సూర్యనాయక్‌, లక్ష్మయ్య, రాములు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:11:04+05:30 IST